News January 27, 2026
అతి త్వరలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల!

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా… అడ్మినిస్ట్రేషన్ కారణాలతో ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం మే 24న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in/
Similar News
News February 3, 2026
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<
News February 3, 2026
మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.
News February 3, 2026
అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.


