News November 23, 2025
అతి పురాతన నక్షత్రాలను నాసా గుర్తించిందా?

బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో ఏర్పడిన పురాతన నక్షత్రాలను NASAకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించినట్టు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో LAP1-B గెలాక్సీలో ఉన్న Population III లేదా POP III అని పిలిచే ఈ స్టార్స్ హైడ్రోజన్, హీలియం తక్కువ ఉండే ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అల్ట్రావయొలెట్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు.
Similar News
News November 24, 2025
సీ క్లే గురించి తెలుసా?

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు క్లే మాస్కులు వాడటానికే మొగ్గు చూపుతున్నారు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వాటిల్లో ఒకటి సీ క్లే. దీన్నే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీంట్లో ఐరన్ ఆక్సైడ్స్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ కూడా అందుతాయి. మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఆయిల్, సెన్సిటివ్ స్కిన్ వారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.
News November 24, 2025
వాట్సాప్ హ్యాక్.. ఇలా చేయండి!

TG మంత్రులు, కొంతమంది ప్రజల <<18366823>>వాట్సాప్ గ్రూపులు<<>>, అకౌంట్లు హ్యాకవడంతో సైబర్ క్రైమ్ అధికారులు జాగ్రత్తలు సూచించారు. ‘వెంటనే www.whatsapp.com/contactలో, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి. ఫోన్ ఓవర్ హీట్, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంటే ఫోన్ హ్యాక్ అయినట్లే. వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి’ అని సూచిస్తున్నారు.
News November 24, 2025
జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.


