News August 21, 2024

అత్తగారింటికి వచ్చి.. అల్లుడు ఆత్మహత్యాయత్నం

image

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చి ఓ వ్యక్తి మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. హుటాహుటిన పోలీసుల సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుజురాబాద్‌కు చెందిన ఓంకార్(25) ఏడాది క్రితమే మణుగూరు యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మణుగూరు ఎస్సై మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు.

Similar News

News February 6, 2026

ఖమ్మం SC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం SCస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన 100మందికి ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, వార్షిక ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉన్న వారు ఈ నెల22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 6, 2026

రేపటితో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగింపు

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోరుకునే వారు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. అభ్యర్థులు ఫారమ్-12తో పాటు డ్యూటీ ఆర్డర్, ఎపిక్ కార్డు నకళ్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు 8న తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.

News February 6, 2026

రేపే నవోదయ ప్రవేశ పరీక్ష

image

పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9వ తరగతి ప్రవేశానికి 505 మంది, 11వ తరగతికి 797 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.