News April 3, 2025
అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
Similar News
News April 4, 2025
కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.
News April 4, 2025
ఏప్రిల్ 30లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడల నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నరేగా పథకంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 60 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 30లోపు ప్రతిపాదలను పంపాలని ఎంఈఓలను ఆదేశించారు.
News April 4, 2025
పాడేరు: తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 3 ఐటీడీఏల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తామన్నారు. కలెక్టరేట్‌లో 18004256826, పాడేరు ఐటీడీఏలో 8935250833, రంప 18004252123, చింతూరు 8121729228 నంబర్లు ఏర్పాటు చేశామన్నారు.