News March 26, 2025
అత్యధిక ఫిర్యాదులు.. మూడో స్థానంలో అనకాపల్లి జిల్లా

సమస్యలపై అనకాపల్లి జిల్లా నుంచే అత్యధిక ఫిర్యాదులు అందినట్లు వెల్లడయ్యింది. CM చంద్రబాబుతో నిన్న జరిగిన సమావేశంలో CS విజయానంద్ పేర్కొన్నారు. గత జూన్ 15 నుంచి ఈ మార్చ్ 19 వరకు జిల్లాలో 45,884 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. అందులో రెవెన్యూకు రిలేటెడ్ కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఎక్కువ ఫిర్యాదులు అందిన జిల్లాల్లో రాష్ట్రంలోనే అనకాపల్లి మూడో స్థానంలో ఉంది.
Similar News
News March 26, 2025
భద్రాచలం: భవనం కూలిన ప్రమాదానికి ఇదే కారణం?

భద్రాచలంలో హఠాత్తుగా కూలిన భవనాన్ని ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టారట. నిబంధనలకు విరుద్ధంగా అలాగే నాసిరకం పిల్లర్లతో పాత భవనంపైనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టవద్దని హెచ్చరించారు. అటు యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
News March 26, 2025
‘గిరిజన నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’

కర్నూలు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ను కలిసి వినతపత్రం అందచేశారు. టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి లేక జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక శిక్షణను సెట్కూరు ద్వారా అందించాలని కోరారు.
News March 26, 2025
MHBD: బెట్టింగ్ పెట్టీ ఇబ్బందులు పడకండి: ఎస్పీ

బెట్టింగ్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. కోలుకోలేని విధంగా ఆర్థికనష్టం జరిగితే, చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే.. IPLఅనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.