News August 21, 2024

అత్యవసరమైతే 1930, 100కు డయల్ చేయండి: ఎస్పీ జానకి

image

జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో షీ టీమ్స్ పనిచేసే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, మహిళల అక్రమ రవాణ, పోక్సో చట్టం, అనేక సమస్యల పరిష్కారంకు షీ టీం బృందం సహాయం చేస్తుందన్నారు. అత్యవసర సమయంలో 1930, 100 కు డయల్ చేయాలన్నారు.

Similar News

News September 14, 2025

MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

image

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

News September 13, 2025

MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

image

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

News September 12, 2025

MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

image

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.