News February 20, 2025
అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లాకు 2 పతకాలు

ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రెండు పతకాలు సాధించారు. కొండపాక సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన నగేష్ అండర్- 20 బాలుర విభాగం జావెలిన్ త్రో లో వెండి పతాకం, మెరీడియన్ పాఠశాల చెందిన సిరి చందన అండర్-16 బాలికల షాట్ పుట్‌లో కాంస్య పతాకం సాధించారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ తెలిపారు.
Similar News
News January 29, 2026
అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలి: MBNR కలెక్టర్

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవితో కలిసి కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జతచేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాలని సూచించారు.
News January 29, 2026
దూబే ‘బ్యాడ్ లక్’.. లేదంటేనా!

NZతో 4వ T20లో IND బ్యాటర్ దూబే దురదృష్టకర రీతిలో ఔటయ్యారు. స్ట్రైక్‌లో ఉన్న హర్షిత్ బంతిని స్ట్రెయిట్‌గా ఆడటంతో అది బౌలర్ చేతికి తగిలి వికెట్లకు తాకింది. దీంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు బయటకొచ్చిన దూబే రనౌటయ్యారు. 15 బంతుల్లో 50, మొత్తం 23 బంతుల్లో 65 రన్స్ చేసిన దూబే ఇంకాసేపు క్రీజులో ఉండుంటే IND గెలిచేదేమో. కాగా T20Isలో IND తరఫున ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. TOP2లో యువీ(12), అభి(14) ఉన్నారు.
News January 29, 2026
సిద్దిపేట: ‘ఫిబ్రవరిలో UDID దివ్యాంగుల క్యాంపులు’

సిద్దిపేట జిల్లాలో ఫిబ్రవరి నుంచి UDID దివ్యాంగుల గుర్తింపు క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు బుధవారం తెలిపారు. లోకోమోటర్, వినికిడి లోపం, మానసిక వైకల్యం, లో విజన్, అంధత్వం విభాగాల వారీగా ఫిబ్రవరి 5, 19 తేదీల్లో క్యాంపులు ఉంటాయన్నారు. అర్హులు అవసరమైన ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.


