News August 25, 2025
అదనపు కట్నం కోసం హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు..!

తమ కూతురిని అదనపు కట్నం కోసం హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ హంటర్ రోడ్డులో జరిగింది. ఆటో డ్రైవర్ పని చేస్తున్న గణేశ్‌కు నాలుగు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామం బాల్య తండాకు చెందిన గౌతమి(21)తో వివాహం జరిగింది. కట్నంగా రూ.20 లక్షలు ఇచ్చారు. కాగా గౌతమికి ఊపిరి ఆడక పోవడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేసరికి గౌతమి మృతి చెందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News August 25, 2025
MBNR: మట్టి వినాయకుడిని పూజించాలి

వినాయక చవితి వేడుకలకు సందర్భంగా ప్రజలు సామాజిక బాధ్యతతో మట్టి వినాయకుడు పూజించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రసాయనాలతో తయారుచేసిన వినాయక ప్రతిమల మూలంగా నీటి కాలుష్యం తీవ్రమవుతుందని భూగర్భ జలాలు కలుషితం అవుతాయని అన్నారు.
News August 25, 2025
నవరాత్రి ఉత్సవాలకు ఫ్రీ కరెంట్: మంత్రి లోకేశ్

AP: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటూ వచ్చిన వినతులపై CM, మంత్రి గొట్టిపాటితో చర్చించినట్లు తెలిపారు. ‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ మండపాలకూ ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది’ అని పేర్కొన్నారు.
News August 25, 2025
VKB: మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన

స్వాతిని కిరాతకంగా నరికి చంపిన మహేందర్ రెడ్డి ఇంటికి రెండు రోజుల నుంచి తాళం వేసి ఉంది. బాధిత కటుంబసభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఇటీవలే స్వాతిని వివాహం చేసుకొని కిరాతకంగా హత్య చేయడంతో స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆదోళన చేశారు. స్వాతిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.