News March 2, 2026
అదే నిజమైతే మరో రికార్డ్!

ధురంధర్-2 రన్‌టైమ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం నిడివి 3 గంటల 55 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే బాలీవుడ్‌లో గత 26ఏళ్లలో లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న రెండో సినిమాగా నిలుస్తుంది. కాగా LOC కార్గిల్ 4 గంటల ఏడు నిమిషాలతో మొదటి స్థానంలో ఉంది. ఈనెల 19న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హోలీ సందర్భంగా రేపు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 14, 2026
PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్‌నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.
News April 14, 2026
‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ‘ నారీ శక్తి వందన్ అధినయం’ బిల్లుకు మద్దతివ్వాలని CM చంద్రబాబు YCP, JSP చీఫ్‌లు జగన్, పవన్ కళ్యాణ్ సహా అన్ని పార్టీల అధినేతలకు, MPలకు లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్న PM మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో, పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని CBN అభిప్రాయపడ్డారు.
News April 14, 2026
జగిత్యాల సభ: ఉత్తర తెలంగాణపై KCR వ్యూహం!

TG: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభను KCR ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే BRSలో చేరనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో BRS పట్టు కోల్పోగా INC, BJP పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో సభలో GOVT వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచేందుకు KCR అడుగులు వేస్తున్నారు.


