News September 10, 2025
అద్దంకిలో ఆరోజు ఏం జరిగింది?

సెప్టెంబర్ 9, 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు కార్యకర్తలు నిర్వహించిన రాస్తారోకో ఫోటోలను టీడీపీ నేతలు SMలో షేర్ చేశారు.
Similar News
News September 10, 2025
హీరోయిన్ నయనతారకు నోటీసులు

హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. <<14567761>>డాక్యుమెంటరీ<<>>లో చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ‘నేను రౌడీనే’ క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్‌లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.
News September 10, 2025
ప్రకాశం: పోస్టల్ స్కాలర్‌షిప్ పొందాలని ఉందా?

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించాలి.
News September 10, 2025
పల్నాడు: ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గన్‌తో కాల్చేశాడు..!

చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (22)ను నోయిడాలో అతని స్నేహితుడు దేవాన్ష్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. మంగళవారం హాస్టల్ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, దేవాన్ష్ తన లైసెన్సుడు పిస్టల్‌తో దీపక్ నుదుటిపై కాల్చాడు. ఆ తర్వాత దేవాన్ష్ కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.