News April 5, 2024
అద్దంకిలో 21 మంది వాలంటీర్లు రాజీనామా

అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.
Similar News
News February 11, 2026
జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
News February 11, 2026
ప్రకాశం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO రేణుక తెలిపారు.
News February 11, 2026
ప్రకాశం: మల్లన్న దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. పులి సంచారం

నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మంగళవారం పెద్దపులి కంటబడింది. పెచ్చేరువులో అన్నదాన శిబిరానికి సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు ఓ పెద్ద పులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు తమ మొబైల్స్‌లో పెద్ద పులిని చిత్రీకరించారు. కాగా అభయారణ్యంలో కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తలు వహించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.


