News February 6, 2025
అద్దంకి ఎక్సైజ్ PSను తనిఖీ చేసిన సూపర్నెంట్

అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను గురువారం బాపట్ల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గీత కులాల మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆయన సిబ్బందికి సూచించారు. అలాగే ఇటీవల కాలంలో నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన ఎక్సైజ్ సీఐ భవానిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 12, 2025
భారీ జీతంతో 340 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026కు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. దీని ద్వారా 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ/BE, బీటెక్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ట్రైనింగ్‌లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది. వెబ్‌సైట్: afcat.cdac.in/* మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 12, 2025
ECHSలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

విశాఖపట్నంలోని <
News December 12, 2025
అక్కడ ‘జాగృతి’ బోణీ.. ఇక్కడ 95 ఏళ్ల వయసులో సర్పంచ్!

TG: పంచాయతీ ఎన్నికల్లో కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ జాగృతి’ బోణీ కొట్టింది. NZB(D) వీరన్నగుట్ట తండా, తాడ్‌బిలోలి పంచాయతీల్లో జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అటు KCR దత్తత గ్రామం యాదాద్రి(D) వాసాలమర్రిలో ఓట్లు సమానంగా రావడంతో టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మరోవైపు SRPT(D) నాగారం సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి (వయసు 95 ఏళ్లు) ఎన్నికయ్యారు.


