News January 15, 2025
అద్దంకి: తెప్పోత్సవానికి భారీ బందోబస్తు

అద్దంకి, సింగరకొండపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నేడు తెప్పోత్సవానికి నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశం ఉండటంతో.. అద్దంకి టౌన్, రూరల్ సీఐలు కృష్ణయ్య, మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి SIలు మహమ్మద్ రఫీ, సురేశ్, ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
News November 6, 2025
ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.
News November 6, 2025
వెలుగొండ ప్రాజెక్ట్‌కు రానున్న మంత్రి నిమ్మల

నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు,రేపు దోర్నాలలో పర్యటించనున్నారు. నేటి రాత్రికి ఆయన దోర్నాలకు చేరుకుంటారు. రేపు ఉదయం కొత్తూరు వద్ద బ్రీచ్ అయిన తీగలేరు వాగును పరిశీలిస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ సందర్శిస్తారు. ఇటీవల ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.


