News December 17, 2025

అద్దంకి: ఫైనాన్స్ వాయిదాల గొడవ.. వ్యక్తిపై దాడి

image

ఓ ఆటో ఫైనాన్స్ వాయిదాల విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు మంగళవారం C.I సుబ్బరాజు తెలిపారు. చెరువుకొమ్మపాలెం చెందిన ప్రసన్నాంజనేయులు (34) అనే వ్యక్తిపై ముగ్గురు ఫైనాన్స్ సిబ్బంది వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు తెలిపారు. ఘటనలో ప్రసన్నాంజనేయులు తలకు, మోకాలిపై గాయాలయ్యాయి. వ్యక్తిని అద్దంకి PHC తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని C.I అన్నారు.

Similar News

News April 5, 2026

సిరిసిల్ల : ఘనంగా ఈస్టర్ డే వేడుకలు

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో ఈస్టర్‌డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తును శిలువ వేసిన మూడో రోజు క్రీస్తు(పునరుథ్థానం) తిరిగి వచ్చిన సందర్భంగా వేడుకలను ప్రత్యేక ప్రార్థనల మధ్య జరిపారు. పలువురు నిరుపేదలకు నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు.

News April 5, 2026

కొలంబియా బిజినెస్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన కేటీఆర్

image

సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ లో శనివారం సాయంత్రం నిర్వహించిన 21వ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ పోరాటం, త్యాగాల నుండి పుట్టిందని, కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో ఒక దశాబ్దంలోనే దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన వివరించారు.

News April 5, 2026

బాధితుల వద్దకే పోలీసులు.. 35 కేసులు నమోదు: ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా పోలీసులు బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 35 కేసులు నమోదు అయ్యాయని జిల్లా ఎస్పీ డా.శబరీష్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.