News November 3, 2024

అద్దంకి: రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

అద్దంకి పట్టణంలో రంగారావు ఆసుపత్రిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆసుపత్రిలో మరమ్మతుల నిమిత్తం కూలి పనికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Similar News

News November 10, 2025

ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

image

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

News November 10, 2025

రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

image

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

News November 10, 2025

ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.