News June 21, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

గంజాయి నిర్మూలనే టార్గెట్: ప్రకాశం ఎస్పీ

image

జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా స్పెషల్ టీం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 6 గంజాయి కేసులలో 25 మంది వద్ద 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రైళ్లలో తనిఖీలు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసి 72 కిలోలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

News December 23, 2025

గిఫ్ట్ అని క్లిక్ చేస్తే.. అంతా ఫట్: ప్రకాశం పోలీస్ హెచ్చరిక

image

వాట్సాప్‌లకు గిఫ్టుల పేరిట వచ్చే ఏపీకె ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని పోలీసులు మంగళవారం కీలక సూచన చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గిఫ్ట్ పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపించే వీటిని క్లిక్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.

News December 23, 2025

బాలినేనికి.. నామినేటెడ్ పదవి ఖాయమేనా?

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. పదవి బాధ్యత కార్యక్రమంలో బాలినేని పేరెత్తి మరీ జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పవన్ ప్రకటించగా.. ఈ జాబితాలో బాలినేని పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీలో కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయట.