News February 28, 2026
అద్దంకి – శ్రీశైలం ఫ్రీ బస్సులో మహిళలను దించేసిన డ్రైవర్

ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో శనివారం నలుగురు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న RTC బస్సులో మార్కాపురం డిపో వద్ద నలుగురు మహిళలు ఎక్కారు. అయితే బస్సు డ్రైవర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించి బలవంతంగా బస్సులోంచి కిందికి దించేశాడని మహిళలు RTC కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 2, 2026
గల్ఫ్‌లో ఉన్నవాళ్లు భారత్ రావాలంటే?

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. INDకు తిరిగి రావాలనుకునేవారికి ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే ఒమన్ మీదుగా IND చేరుకోవడం. ఆ దేశంపై ఇరాన్ దాడి చేయడం లేదు. దీంతో భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. దుబాయ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు బైరోడ్ 450km ప్రయాణించాలి.
News March 2, 2026
మన్యంకొండ: శ్రీ అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ

మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజపతాకాన్ని ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
News March 2, 2026
నిర్మల్: ఇంటర్ పరీక్షకు 317 మంది డుమ్మా

ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 7,392 మంది విద్యార్థులకు గాను 7,075 మంది పరీక్ష రాశారని.. 317 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.


