News March 19, 2025
అద్భుతం.. సుద్ద ముక్కతో మక్కా మజీద్

ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుకృష్ణ శుద్ధ ముక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. మక్కా మజీద్ నమూనాను తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ నమూనాను తయారు చేసినట్లు మధుకృష్ణ వెల్లడించారు. చిత్రకారుడిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 9, 2026
విశాఖ: డాక్టర్ సుధాకర్ కుమారుడికి ప్రమోషన్

గతంలో విశాఖలో ప్రభుత్వ డాక్టర్‌గా పని చేసిన సుధాకర్ కుమారుడు లలిత ప్రసాద్‌కు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయనకు డిప్యూటీ తహశీల్దారుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సుధాకర్ కుటుంబం నర్సీపట్నంలో ఉండేది. కరోనా సమయంలో మాస్కుల విషయంలో సుధాకర్ ప్రశ్నించగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారు.
News January 9, 2026
చరిత్ర సృష్టించిన రుతురాజ్

లిస్టు-A క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(58.83) నమోదుచేసిన ఆటగాడిగా నిలిచారు. ఇతను 99 మ్యాచ్‌లలో 5,060 రన్స్ చేశారు. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెవాన్(57.86), హెయిన్(57.76), కోహ్లీ(57.67) ఉన్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ(59) మ్యాచుల్లో 15 శతకాలు బాదిన ప్లేయర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కారు.
News January 9, 2026
పాలమూరు: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 8న జిల్లా కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు tsstudycircle.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


