News November 10, 2024

అధికారంలో వస్తే వారిని వదలం: కాకాణి

image

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కొని విధులు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. జగన్‌పై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడతారన్నారు.

Similar News

News November 13, 2024

నెల్లూరు: DSC పరీక్షలకు ఉచిత శిక్షణ

image

ఏపీ బీసీ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు DSC పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి కే ప్రసూన ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ BC, SC,ST, EBC అభ్యర్థులు అర్హులన్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రు.లక్ష లోపు ఉండి, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు BC స్టడీ సర్కిల్‌లో 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News November 13, 2024

మంత్రికి వెంకటగిరి ఎమ్మెల్యే వినతి

image

వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. విజయవాడలో మంత్రి నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉద్యోగ సిబ్బంది కొరత ఉందని.. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

News November 12, 2024

నెల్లూరు: అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

అత్యాచారం ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ. 23వేల జరిమానా పడినట్లు చిల్లకూరు SI సురేశ్ బాబు తెలిపారు. మండల పరధిలోని ఓ గ్రామంలో 2021లో ఓ మైనర్ బాలికను కావూరు మస్తాన్ బాబు అపహరించి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు మంగళవారం నిందితుడికి శిక్ష ఖారారు చేసినట్లు SI తెలిపారు.