News October 13, 2024
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
అక్టోబర్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14 నుంచి 15 వరకు తేలిక పాటు వర్షాలు కురుస్తాయని, 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Similar News
News November 24, 2024
ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత
మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిపై శనివారం కృష్ణా జిల్లా గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వంగాయిగూడెంకు చెందిన ఓ బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. బాలిక 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
News November 24, 2024
భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’
భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 23, 2024
నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ)కు ఎంపిక
నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న హోటల్ ఒబెరాయ్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా లేస్ పార్క్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.