News November 19, 2024
అధికారులకు అన్నమయ్య కలెక్టర్ హెచ్చరికలు
ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. గాలివీడు మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2024
కడప జిల్లాలో దారుణ ఘటన
కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 21, 2024
ఉత్కంఠ రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసు
YS వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ స్పీడ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వివేకా కుమార్తె YS సునీత CM చంద్రబాబుని కలిసి దీనిపై చర్చించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న MP అవినాశ్ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు సైతం జారీ చేసింది. వివేకా PA కృష్ణారెడ్డి ఇంటికి విచారణ కోసం పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2024
చక్రాయపేటలో గొర్రెకు 8 కాళ్ల జంతువు జననం
చక్రాయపేట మండలం కే. రాజు పల్లె గ్రామంలో బుధవారం ఓ గొర్రెకు 8కాళ్ల వింత జంతువు జన్మించింది. రసూల్ కు చెందిన గొర్రె ఈ విధంగా జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ వింతలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.