News March 5, 2025

అధికారులకు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు

image

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్‌ అన్నారు. అమలాపురం భట్లపాలెం ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సీజన్‌లో ఎక్కడ లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News November 9, 2025

సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

image

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్‌. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.

News November 9, 2025

HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

image

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.