News March 5, 2025
అధికారులకు కర్నూలు కలెక్టర్ సూచనలు

మహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవ నిర్వహణపై అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా రంగాల్లో విజయాలు సాధించిన మహిళలను ఆహ్వానించి సన్మానం చేయాలని చెప్పారు. ముందుగా అమరావతి నుంచి ఇదే అంశంపై కలెక్టర్‌తో మంత్రి సమీక్ష చేశారు.
Similar News
News March 6, 2025
బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి దుర్మరణం

నంద్యాల జిల్లా ఆత్మకూరులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీశ్.. ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆత్మకూరులోని కేజీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక వస్తున్న బొలెరో వాహనం తగిలింది. తీవ్రంగా గాయపడిన సతీశ్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 6, 2025
నగర, పురపాలక సంస్థలకు నిధుల విడుదల

కర్నూలు నగర, 9 పురపాలక సంస్థలకు 2023-24కు గానూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.19 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కర్నూలుకు రూ.15.81 కోట్లు, గూడూరుకు రూ.1.08 కోట్లు, ఆదోనికి రూ.5.47 కోట్లు, ఎమ్మిగనూరుకు రూ.3.08 కోట్లు, నంద్యాలకు రూ.7.15 కోట్లు, ఆళ్లగడ్డకు రూ..82 కోట్లు, డోన్‌కు రూ.1.92 కోట్లు, నందికొట్కూరుకు రూ.1.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.1.76 కోట్లు, బేతంచెర్లకు రూ.1.43 కోట్లు ఇచ్చింది.
News March 6, 2025
8న కర్నూలులో జాతీయ లోక్ అదాలత్

కర్నూలు జిల్లాలో ఈనెల 8వ తేదీన కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.