News March 6, 2025

అధికారులకు కీలక సూచనలు చేసిన ప్రకాశం కలెక్టర్

image

ఈనెల 8వ సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కీలక సూచనలు చేశారు. కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

Similar News

News April 22, 2025

కేవీపీఎస్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

image

కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. కేవీపీఎస్ సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు-2025లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఒంగోలు అంబేడ్కర్ భవనంలో మే 8న, అలాగే మద్దిపాడులోని నటరాజ్ కళాక్షేత్రంలో మే 9న నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. కలెక్టర్ పాల్గొని తిలకించాలని ఆహ్వానించారు.

News April 22, 2025

ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!