News September 26, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

image

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కొల్లిపర మండలంలో పర్యటించారు. కృష్ణా నదికి భారీగా వరద రావడంతో పాటు లంక గ్రామాలకు ఎఫెక్ట్ ఉండడంతో పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను గమనించారు. బొమ్మువానిపాలెంలో గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఉండాలని సబ్ కలెక్టర్ సంజన సింహకు సూచించారు.

Similar News

News September 26, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. జులై నెలలో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ డాన్స్, ఎంఏ డాన్స్ కూచిపూడి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ లోపు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

News September 26, 2025

గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ పొడిగింపు

image

రైలు సంఖ్య 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ను తాత్కాలికంగా పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు (తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు) ఈ రైలు సేవలు ధర్మవరం వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పొడిగింపు ద్వారా రైలు పాకాల-మదనపల్లె రోడ్-కదిరి మీదుగా ధర్మవరం వరకు ప్రయాణిస్తుంది. ఈ తాత్కాలిక సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

News September 26, 2025

OG సినిమాపై అంబటి కౌంటర్

image

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమాపై గురువారం వ్యంగ్యంగా స్పందించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో, ‘ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ, ఫలితం మాత్రం శూన్యం. దానయ్య.. దండగ పడ్డావయ్యా!’ అని ఆయన ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలంగా నిలవలేకపోయిందని ఎత్తిచూపుతూ రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.