News February 9, 2025
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ఎ.కొండూరు కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ.. వివిధ శాఖల సమన్వయంతో విస్తృత జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
Similar News
News December 10, 2025
VZM: కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి గమనిక

ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 15న జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని SP ఏ.ఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈనెల 16న మంగళగిరి బెటాలియన్‌లోని పెరేడ్ మైదానంలో CM చంద్రబాబుతో ముఖాముఖి అనంతరం అక్కడే వీరికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని, PTC, DTCలో అభ్యర్థులు ఈనెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
News December 10, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. పాస్ లేకుంటే నో ఎంట్రీ

ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న జరిగే మెస్సీ–గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టినట్టు రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. టికెట్ లేదా పాస్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పాస్ లేకుండా స్టేడియం వద్దకు రావొద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, అంతా సహకరించాలని కమిషనర్ కోరారు.
News December 10, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తేజస్వి

రామగుండం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో యూత్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం MLA- MSరాజ్ ఠాకూర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


