News February 3, 2025

అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 3, 2025

నవీపేట్: కోడి పందేలు ఆడుతున్న ఆరుగురి అరెస్టు

image

నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం కొంత మంది కోడి పందేలు ఆడుతుండటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2 కోడిపుంజులు, రూ.4650 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురు నిజామాబాద్, ఒకరు సిరంపల్లి, మరొకరు తీర్మాన్‌పల్లికి చెందిన వారు ఉన్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ వినయ్ వెల్లడించారు.

News February 3, 2025

వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు

image

వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కారుణ్య నియామకాలు, ఆపద్బంధువు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రైతు భరోసా, రుణ మాఫీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు.

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.