News March 28, 2025

అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

image

ఇసుక రీచ్‌లలో ఇసుక నిల్వల పెంపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలపై గనుల శాఖ అధికారులతో ఆయన ఆరా తీశారు.

Similar News

News February 23, 2026

సిరిసిల్ల నుంచి జగిత్యాలకు మళ్లీ అదే పులి వచ్చిందా?

image

ఉమ్మడి KNR జిల్లాలో <<19210224>>పెద్దపులి<<>> సంచారం పల్లెవాసులను వణికిస్తోంది. ఇటీవల సిరిసిల్ల, వేములవాడ అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు కలకలం సృష్టించగా, నిన్న జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. గతేడాది కొడిమ్యాల ప్రాంతంలో సంచరించిన పులే మళ్లీ వచ్చిందా? లేక అనువైన ప్రాంతం, జత కోసం ఇక్కడికి చేరుకుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News February 23, 2026

కొత్తగూడెం కార్పొరేషన్.. సౌకర్యాలు అంతంతే..!

image

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ఇటీవల కార్పొరేషన్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్లు, మేయర్, డి.మేయర్ ప్రమాణ స్వీకారం.. పాత కౌన్సిల్ హాల్‌లోనే పూర్తి చేశారు. ఈ నెలలోనే పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సి ఉండగా పాత హల్లోనే పాలకవర్గం నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

News February 23, 2026

కర్నూలులో కెరీర్ గైడెన్స్ సెమినార్ సక్సెస్

image

కర్నూలులోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం Way2News & Resonance సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా కెరీర్ గైడెన్స్ సెమినార్ విజయవంతమైంది. CBI మాజీ JD లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన కల్పించారు. జేడీ సూచనలు తమను ఎంతో ప్రభావితం చేశాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.