News October 13, 2025
అధికారులకు విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్‌ల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమాలకు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిర్యాదుల రీ-ఓపెనింగ్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతి రోజు కనీసం 60 ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News October 13, 2025
విజయనగరం పీజీఆర్ఎస్‌కు 184 ఫిర్యాదులు

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 184 ఫిర్యాదులు అందాయి. రెవెన్యూకు సంబంధించి 69 ఫిర్యాదులు రాగా, డీఆర్డీఏకి సంబంధించి 28, డీపీఓకు సంబంధించి 13, మున్సిపాలిటీలకు సంబంధించి 13, GSWS 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి, తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు.
News October 13, 2025
ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: DSP

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసు అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
News October 13, 2025
జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతల స్వీకరణ

విజయనగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా వి.వెంకట సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, మహాకవి గురజాడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ సిబ్బంది వెంకట సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.