News March 15, 2025
అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Similar News
News March 2, 2026
GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.
News March 2, 2026
ASF: దివ్యాంగులకు ఇక ఉచిత బస్సు ప్రయాణం

కొమరం భీమ్ జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లింగభేదం లేకుండా దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు జిల్లాలోని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
News March 1, 2026
జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించిన CJI

అమరావతిలో నిర్మించిన జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ఆదివారం CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. నిర్మాణం పూర్తైన జడ్జిల బంగ్లాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం CJI పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారాన్ని అధికారులు CJI, న్యాయమూర్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.


