News October 3, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి

భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నాగవళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News October 3, 2025
మక్తల్: భార్యను నమ్మించి దారుణ హత్య

మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యారం గ్రామంలో శుక్రవారం భార్య వినోద (32)ను భర్త కృష్ణారెడ్డి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పొలం వద్ద జరిగిన దసరా దావత్ అనంతరం కుటుంబ సభ్యులను పంపేసి ఒంటరిగా మాట్లాడుతానని నమ్మించి గొంతు కోసి, శరీరంపై పలుచోట్ల కత్తితో గాయపరిచి చంపాడు. అతడికి గత నేర చరిత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నాడు.
News October 3, 2025
మీ దసరా సెలవులు ముగిశాయా?

TGలో స్కూళ్లకు దసరా సెలవులు నేటితో ముగిశాయి. 13 రోజుల తర్వాత విద్యార్థులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. పల్లెలకు వెళ్లిన ఫ్యామిలీలు పట్నం చేరుకుంటున్నాయి. అయితే రేపు ఒక్కరోజు పాఠశాలకు వెళ్తే ఎల్లుండి ఆదివారం మళ్లీ హాలిడే రానుంది. దీంతో పిల్లలతో ఊరెళ్లిన చాలామంది పేరెంట్స్ మరో రెండు రోజులు అక్కడే ఉండి, సోమవారం నుంచి స్కూల్ పంపాలని చూస్తున్నారు. మరి మీ సెలవులు ముగిశాయా? ప్లాన్ ఏంటి? COMMENT
News October 3, 2025
క్యారవాన్ టూరిజన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు: కలెక్టర్

జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రానున్న రోజుల్లో నూతన వరవడిని చూపుతుందన్నారు. క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ బస్సు సూర్యలంక బీచ్‌లో శని, ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.