News November 29, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఆనం

image

దిత్వా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. పెన్నా పరివాహక ప్రాంతాలు, తీరప్రాంత గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. చెరువులు, వాగుల పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు.

Similar News

News February 28, 2026

నెల్లూరు: ప్రతి ఒక్కరికీ 125 పనిదినాలు

image

వీబీ జీ రాంజీ చట్టంపై మార్చి 27వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నూతన చట్టం ప్రకారం 125 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామసభల్లో వివిధ అంశాలపై ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని ఆదేశించారు.

News February 28, 2026

నెల్లూరు జిల్లాలో 33 మందికి కేంద్ర పతకాలు

image

నెల్లూరు జిల్లాలో 2025లో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవ, ఉత్కృష్ట సేవా పతకాలను ప్రకటించింది. 13 మంది అతి ఉత్కృష్ట. 23 మంది ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు.

News February 28, 2026

నెల్లూరు జిల్లాకు రూ.126.91 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,89,647 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం రూ.126.91 కోట్లను కేటాయించిందని DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.