News September 1, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.
Similar News
News August 30, 2025
మెదక్: నితన్య సిరి అభినందించిన ఎస్పీ

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబర్లో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.
News August 30, 2025
వినాయక నిమజ్జనాల సమయంలో జాగ్రత్త: కలెక్టర్

భారీ వర్షాలు, వరదల కారణంగా మెదక్ జిల్లాలో అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. కావున వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లాలో చెరువుల పరిస్థితిపై మాట్లాడారు. మెదక్ జిల్లాలో 2,632 చెరువులు భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయాయన్నారు. వినాయక నిమజ్జన సమయంలో పోలీస్, రెవెన్యూ మున్సిపల్, పంచాయితీ అధికారుల సూచనలు పాటించాలన్నారు.
News August 30, 2025
మెదక్: దెబ్బతిన్న 60 పీఆర్ రోడ్లు డ్యామేజ్

మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.