News March 21, 2025
అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల గురించి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నాణ్యత పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పుష్కరాల సమయానికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
Similar News
News September 14, 2025
ఆ రైలు నరసాపురం వరకు పొడిగించండి: RRR

చెన్నై-విజయవాడ వందేభారత్ రైలు నరసాపురం వరకు పొడిగించాలని శాసనసభ ఉపసభాపతి రఘురామ కేంద్ర రైల్వే కమిటీకి తాజాగా లేఖ రాశారు. భీమవరం మీదుగా నరసాపురం వరకు ఈ రైలు పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి అనకాపల్లి ఎంపీ, రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ సానుకూలంగా స్పందించారని రఘురామ వెల్లడించారు.
News September 14, 2025
NLG: దసరాకు స్పెషల్ బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 705 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ మేరకు రీజియన్ రూపొందించిన నివేదికను ఆర్టీసీ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో 131 బస్ సర్వీసులు, కోదాడలో 94, MLG 115, నల్గొండ 89, NKP 36, SRPT 144, యాదగిరిగుట్ట పరిధిలో 96 బస్ సర్వీసులు నడపనున్నారు.
News September 14, 2025
ములుగు జిల్లాలో 422మి.మీ భారీ వర్షపాతం నమోదు

ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 422మి.మీ వాన పడింది. సగటు వర్షపాతం 46.8మి.మీగా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వెంకటాపురంలో 130.2, వాజేడులో 43.6, మంగపేటలో 24.2, వెంకటాపూర్ లో 34.2, ములుగులో 17.2, గోవిందరావుపేటలో 23.6, తాడ్వాయిలో 23.6, ఏటూరునాగారంలో 61.6, కన్నాయి గూడెంలో 63.8మి. మీ వర్షం కురిసింది.