News November 18, 2025
అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్లకు FULL DEMAND

తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్‌కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్‌లో TG 09 సిరీస్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్‌కు అనేక మంది దరఖాస్తు చేసే పరిస్థితుల్లో రవాణా శాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అలాగే ఓవర్ ల్యాపింగ్ అప్లికేషన్లకు ఆన్‌లైన్ వేలంపాట విధానం ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచుతోంది.

త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.