News August 16, 2025

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండండి: మంత్రి కొండా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలోని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.

Similar News

News August 16, 2025

కాళ్ల: లచ్చన్న జయంతి వేడుకలు

image

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

News August 16, 2025

రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

image

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.

News August 16, 2025

బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

image

జిల్లా బీసీ సంక్షేమ సంఘం పూర్తి కార్యవర్గాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని సంఘ భవనంలో జిల్లాధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శులుగా పూదరి జనార్దన్, డాక్టర్ కిరణ్, ఉపాధ్యక్షులుగా భోజన్న, విశాల్ సాయి, లింబాద్రి, కార్యదర్శులుగా అంబదాస్, నరహరి, భోజన్న, రాజ మహేందర్, సహకార్యదర్శులుగా మహేష్, సాయినాథ్, సంజు ఎన్నికయ్యారు.