News July 4, 2025
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు కలెక్టర్

గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఏటూరునాగారం, మంగపేటలోని గోదావరి కరకట్టను ఆయన పరిశీలించారు. రాబోయే వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Similar News
News July 4, 2025
మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <
News July 4, 2025
జగిత్యాల: ‘డ్రెయిన్‌లు, వాగులు తక్షణం శుభ్రపరచాలి’

JGTL మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రత పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గోవిందపల్లి, శంకులపల్లి, సోడా సెంటర్, రామాలయం, SRSP కాలువ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్, నీటిపారుదల, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో పని జరగాలని, ప్రైవేట్ భూముల్లో ముల్లు మొక్కలు తొలగించకపోతే జరిమానాలు విధించాలన్నారు.
News July 4, 2025
రైతులు దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఢిల్లీరావు

ఎరువుల తయారీదారులు, పంపిణీదారులతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు. యూరియా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30% అధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని ఢిల్లీరావు చెప్పారు. ఎరువుల లభ్యతపై రైతాంగం దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. డీలర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.