News February 13, 2025
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కలెక్టర్

ఈ నెల 27న MLC ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా నియమితులైన వారు బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. బుధవారం జడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.
Similar News
News September 12, 2025
కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
News September 11, 2025
కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.
News September 11, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: ఈ నెల 13న లోక్ అదాలత్
☞ గరికపర్రులో జిల్లా జూడో జట్లు ఎంపిక
☞ ఉమ్మడి కృష్ణాలో 70 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ
☞ మచిలీపట్నం విజయవాడ హైవే ప్రమాదం.. స్పాట్ డెడ్
☞ కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు
☞ చల్లపల్లి పాఠశాల అన్నంలో పురుగులు
☞ చేవేండ్రలో దొంగతనం