News December 19, 2024
అధికారులు సంసిద్ధం కావాలి: ప్రకాశం కలెక్టర్

సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అధికారులు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. యువ ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాధారణ జనాభాకు ఓటర్ల జాబితా నిష్పత్తిని సరి చూసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
News September 14, 2025
ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.
News September 14, 2025
ప్రకాశం లోక్ అదాలత్‌లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.