News March 20, 2024
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
Similar News
News April 18, 2025
NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.
News April 18, 2025
NZB: చరిత్ర ఆధారాలను గుర్తు చేస్తున్న క్లాక్ టవర్.. Way2News స్పెషల్..

NZBలో దశాబ్దాల క్రితం నిర్మించిన క్లాక్ టవర్ చారిత్రాత్మక ఆధారాలను గుర్తు తెస్తుంది. 1905లో సిర్నాపల్లి సంస్ధాన్ పాలకురాలు శీలం జానకీ బాయి క్లాక్ టవర్‌తో పాటు రెండు స్వాగత తోరణాలను నిర్మించేందుకు ఐదు ఎకరాలను విరాళంగా ఇచ్చారు. స్వాతంత్య్రానికి ముందు NZB మార్కెట్ యార్డును ‘మహబూబ్ గంజ్’ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని ‘గాంధీ గంజ్’గా మార్చారు. క్లాక్ టవర్‌లోని అలారం ఆధారంగా ఇక్కడ వ్యాపారాలు జరిగేవి.
News April 18, 2025
NZB: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కుంచెపుబాబు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా ఓ వ్యక్తి బ్లేడుతో మెడపై కోశాడు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న బాధితుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకొని బ్లేడ్‌తో బాబు మెడపై కట్ చేశాడని రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే తమకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.