News October 29, 2025

అధికారులు సమన్వయనంతో పని చేయాలి: మంత్రి ఉత్తమ్

image

మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.!

image

మెంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, కృష్ణా నది ఉపనదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కృష్ణా నదికి వేగంగా వరదలు వస్తున్నట్లు రివర్ కన్జర్వేటర్-కృష్ణ & ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో నేడు 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని, వరద వేగంగా పెరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 30, 2025

కృష్ణా: తుపాన్ బాధితులకు సాయం.. ఏమేమి ఇస్తున్నారంటే.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొంథా తుపాను బాధితులు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, వీవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. పునరావాస కేంద్రాలలో ఒక్కరికి రూ. 1000 నుంచి రూ.3వేల వరకు నగదు, 50 కేజీల బియ్యం, పప్పు, పంచదార, కూరగాయలు వంటి నిత్యావసరాలను నేడు అందజేయనున్నారు. NTRలో 485 కుటుంబాలు, మత్స్యకారులకు చెందిన 1,488, కృష్ణాలో 35-37వేల కుటుంబాలను ఆర్థిక సాయం కోసం ఎంపిక చేశారు.

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

image

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.