News January 28, 2025
అధికారులు సిద్ధంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్ నందు మంగళవారం జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి ఆయా శాఖల జిల్లా అధికారులు నివేదికలను అందజేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
భద్రాద్రి: ఏ క్యాహై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో..!

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో మృతి చెందిన వారి అంతిమయాత్రలో బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కబరస్థాన్ (శ్మశానవాటిక)కు వెళ్లే రోడ్డు మార్గం లోతైన గుంతలతో, బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు మృతదేహాన్ని భుజాలపై కాకుండా, చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి, రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 9, 2025
ఆదిలాబాద్: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌లోని ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94921 36510 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


