News December 23, 2025
అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్‌లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
Similar News
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
News January 2, 2026
IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 2, 2026
వామకుక్షితో ఆరోగ్యం, ఆనందం

ఎడమ వైపు పడుకుంటే జీర్ణాశయం ఆకృతి కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా మారుస్తుంది. కాలేయం, కిడ్నీలు బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ భంగిమ మెదడును చురుగ్గా ఉంచి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గిస్తుంది. గర్భిణీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. SHARE IT


