News December 1, 2025

అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో బాపట్ల రైతులు..!

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.

Similar News

News December 3, 2025

‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

image

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.

News December 3, 2025

ఇది ‘RU-KO’ షో

image

రాయ్‌పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్‌గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.

News December 3, 2025

మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా విధులు నిర్వహించాలి: మస్రత్ ఖానం

image

మైక్రో అబ్జర్వర్లు తమ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం సూచించారు. బుధవారం నిర్మల్ కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఆమెతో పాటు కలెక్టర్ అభిలాష అభినవ్ ఉన్నారు.