News August 28, 2025
అధికార ప్రకటన.. రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చమర్తి

రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్ రాజును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇన్‌ఛార్జ్‌గా చమర్తిని స్వయంగా ప్రకటించినప్పటికీ, ఉత్తర్వులు మాత్రం గురువారం అందాయి.
Similar News
News August 28, 2025
తిరుపతి: బాలికపై అత్యాచారం.. 26 ఏళ్ల జైలుశిక్ష

తిరుపతి జిల్లా చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన కన్నా శ్రీనివాసులు(21) మైనర్ బాలికపై కన్నేశాడు. 2021 జులై 14న బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికను శ్రీనివాసులు కిడ్నాప్ చేసి వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి 26ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి సుమ గురువారం తీర్పు చెప్పారు.
News August 28, 2025
NLG: ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు ఈనెల 30 చివరి తేదీ

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News August 28, 2025
హరిత నగరంగా అమరావతి

అమరావతిలో గ్రీనరీ అభివృద్ధి పనులను APCRDA, ADCL లు ప్రణాళికాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. పర్యాటకం, పర్యావరణ పరిరక్షణలతో కూడిన అనేక ప్రాజెక్టులను చేపట్టి, అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర కృషి జరుగుతోంది. 4,716 హెక్టార్ల విస్తీర్ణంలో అమరావతిలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వం, వినోదానికి కేంద్రంగా నిలుస్తుంది.