News March 19, 2025

అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగుచేయండి: వరంగల్ కలెక్టర్

image

రైతులు త‌క్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ముందుకు రావాలని జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి చేయాల్సి వస్తుందని అన్నారు.

Similar News

News November 9, 2025

శ్రీరాంపూర్: ‘ఉత్పత్తి లక్ష్యసాధనకు సమిష్టిగా పనిచేయాలి’

image

నవంబర్ మాసంలో నిర్దేశిత 72 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనకు రోజుకు 2.40 లక్షల టన్నులు బొగ్గు, ఉత్పత్తి రవాణా సాధించాలని సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్. బలరామ్ పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, కార్పొరేట్ విభాగాలు, అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు.

News November 9, 2025

HEADLINES

image

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు

News November 9, 2025

మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.