News September 23, 2025

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: డీటీఓ

image

దసరా పండుగను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 388 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి, రూ.33 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వారం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News September 23, 2025

విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు: నిర్మల్ డీఈవో

image

బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. కాంప్లెక్స్, మండల పరిధిలో పోటీలను తొలుత నిర్వహించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామన్నారు.

News September 23, 2025

మిర్యాలగూడలో భారీ చోరీ.. దొంగలు దొరికారు

image

మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్‌లో జరిగిన భారీ చోరీ కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.66.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు.

News September 23, 2025

MHBD: వివాహితను హత్య చేసిన ప్రియుడు

image

వివాహిత హత్యతో మహబూబాబాద్ మండలం సికింద్రాబాద్ పరిధి సొమ్ల తండాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన బోడ స్వరూప(37)కు 3 సం. నుంచి ఇంటి పక్కన ఉండే బానోత్ అనిల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరు హైదరాబాద్‌లో కలిసి ఉండగా.. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రియుడు ఆవేశంలో వివాహితను హతమార్చాడు. స్వరూపకు భర్త రవి, కూతురు, కుమారుడు ఉన్నారు.