News August 29, 2025

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: SP

image

కురిసిన కుండ పోత వర్షాలకు ముంపునకు గురైన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్‌లోని రైతు వేదికలో బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విపత్తు నిర్వహణ బృంద సభ్యులకు కలిసి అభినందించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.

Similar News

News August 29, 2025

గద్వాల: సెప్టెంబర్ 1న బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

image

గద్వాల జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం ఉంటుందని బీజేపీ నేతలు శుక్రవారం పేర్కొన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. జిల్లాలో యూరియా కొరత, వర్షాలతో నష్టపోయిన పంటలు, మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ హాజరవుతారని తెలిపారు.

News August 29, 2025

వనపర్తి కలెక్టరేట్ ముందు కార్మికుల ధర్నా

image

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నేతలు రమేశ్, మండ్ల రాజు మాట్లాడుతూ..కార్మికులపై ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. అన్ని పనులు చేయించుకుని వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.

News August 29, 2025

పార్వతీపురం: అర్హత కలిగి అప్పీల్ చేసిన వారికి పింఛన్ పంపిణీ

image

దివ్యాంగుల పింఛన్ విచారణకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో అప్పీల్ చేయవచ్చన్నారు. అర్హత కలిగి అప్పీల్ చేసిన వారికి ఒకటవ తేదీన పింఛను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.