News April 9, 2025
అనంతం: రాష్ట్ర వ్యాప్తంగా AP-ECETకు దరఖాస్తులు

అనంతపురం JNTU నిర్వహిస్తున్న APECET-2025 పరీక్షకు అపరాధ రుసుము లేకుండా 33,454 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు APECET ఛైర్మన్ హెచ్.సుదర్శన రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,000 అపరాధ రుసుముతో ఈనెల 12 వరకు.. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 17 వరకు.. రూ.4,000 అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు.. రూ.10,000 అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
Similar News
News February 18, 2026
ATP: రేపటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ గుత్తిలో….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
ఈ-పంట నమోదు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను యుద్ధప్రతిపాదికన ముగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
News February 18, 2026
అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.


