News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.
Similar News
News March 10, 2025
కేటీఆర్ అందుకే కేసుల గురించి భయపడరు: సీఎం రేవంత్

KTR అధికారం పోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని CM రేవంత్ అభిప్రాయపడ్డారు. ‘KTR నా స్టేటస్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయం ఉంటే నేరమే చేయరు. KTR కూడా అంతే. అందుకే కేసులకు భయపడను అంటున్నారు. MLC ఎన్నికల్లో BRS పోటీ చేయకుండా తప్పించుకుంది. హరీశ్ రావు లాంటివాళ్లు ఆ ఎన్నికల్లో దొంగ దెబ్బ తీశారు’ అని పేర్కొన్నారు.
News March 10, 2025
Rs 49000 కోట్లు: APతో టాటాపవర్ MOU

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాటా పవర్ సబ్సిడరీ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 7000 MW సామర్థ్యంతో సోలార్, విండ్, హైబ్రీడ్ సహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. పరిస్థితులను బట్టి స్టోరేజ్ సొల్యూషన్స్ నిర్మిస్తుందని తెలిసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.49000 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. ఎక్కడ నిర్మిస్తారో తెలియాల్సి ఉంది.
News March 10, 2025
సీఐడీ చేతికి ఫాల్కన్ ఇన్వెస్టింగ్ కేసు!

తెలంగాణ సీఐడీ చేతికి ఫాల్కన్ కేసు వెళ్లనుంది. ఇప్పటివరకు 19 మంది నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఫాల్కన్ కేసును సీఐడీ బదిలీకి సైబరాబాద్ పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో వేల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్ పోలీసులు సీఐడీకి అప్పజెప్పే అవకాశం కనబడుతోంది.